సారా విక్రయిస్తూ సెబ్ పోలీసులకు పట్టుబడ్డ నిందితుడికి శుక్రవారం దర్శి జెఎఫ్సీఎం కోర్టు న్యాయమూర్తి సరస్వతి జైలుశిక్ష విధించారు. సెబ్ సీఐ సుందరరా మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరు మండలం తూర్పు గంగవరానికి చెందిన నాగు లూరి శ్రీను 2021 ఫిబ్రవరి 22న పది లీటర్ల సారాతో సెబ్ పోలీసులకు పట్టుబడగా, కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారించిన న్యాయమూర్తి నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ. రెండు లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించి నట్లు వివరించారు.
సారా విక్రయం కేసులో నిందితుడికి జైలు శిక్ష
07
Oct