అంతర్జాతీయంగా పొగాకు పంట డిమాండ్ తగ్గిన నేపథ్యంలో బోర్డు రైతుల వద్ద పొగాకు కొనుగోలు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే సాగు చేయాలని ఒంగోలు వేలం నిర్వహణాధికారి కోవి రామకృ ష్ణ కోరారు. ఒంగోలులో బుధవారం పాగాకు సాగు రైతులకు పంట సాగు నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సద స్సులో వేలం నిర్వహణాధికారి కోవి రామకృష్ణ మాట్లాడుతూ ఒక్కో బ్యారన్ కు 4.75 ఎక రాలు, 3550 కేజీలు మాత్రమే అనుమతి ఉన్నందుకు రైతులు విస్తారంగా పొగాకు సాగు చేయవద్దని చెప్పారు. కౌలు భూములు, అద్దె బ్యారన్లతో పొగాకు సాగు లాభదా యకం కాదని, స్వంత బ్యారన్, భూమి ఉన్న వారు మాత్రమే పొగాకు సాగు చేయడం లాభ దాయకమని చెప్పారు. అనధికార లీజులు చెల్లవు అని వివరించారు. ఫీల్డ్ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… నూతన సాంకేతిక పరిజ్ఞానం పొగాకు నారు మడులు చేపడితే నాణ్యమైన పొగాకు ఉత్పత్తి సాగవుతుందని చెప్పారు. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలు శనగ, కంది, మిరప సాగు చేసుకోవాలని సూచించారు. రైతులను ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

