రైతులు పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని పొగాకు బోర్డు ప్రాంతీయ అధికారి (ఎస్బిఎస్, ఎస్ఎల్ఎస్) ఎం. లక్ష్మణరావు కోరారు. త్రోవగుంట పొగాకు బోర్డులో శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాంతీయ కార్యాలయ అధికారి లక్ష్మణరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి వై గోపిచంద్, ఒంగోలు ఎడీఏ రమేష్ బాబు, కెవీకే శాస్త్రవెత్త టి వెంకటేశ్వర రెడ్డిలు ముఖ్య అతిధులుగా పాల్గొని రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రాంతీయ అధికారి లక్ష్మణరావు మాట్లాడుతూ… అంతర్జాతీయంగా పొగాకు సాగు పెరిగినందున. డిమాండ్ తగ్గిందని చెప్పారు. పొగాకు బోర్డు అనుమతి మేరకు పండించాలని సూచించారు. జిల్లా ఉద్యానవన శాఖాధికారి వై గోపిచంద్ మాట్లాడుతూ… మన నేల స్వభావాన్ని బట్టి సుగంధ ద్రవ్య పంటల సాగు చేసుకోవాలని సూచించారు. కెచీకే శాస్త్రవేత్త టి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ
…మన వాతావరణ పరిస్థితులను శనగ, మినుము, ధనియాలు, రబీ కంది, బొబ్బర్లు, జొన్న, కొర్ర, కుసుమ, మొక్కజొన్న, మిరప, రాగులు, పెసర సాగుకు రకాలు, విత్తు సమయం, దిగబడి సస్యరక్షణను వివరించారు. ఎడీఏ రమేష్ బాబు మాట్లాడుతూ ….రైతులకు ఆర్టికేల ద్వారా అన్ని విధాలుగా సహకరిస్తున్నారని, ఎరువులు, అవసరమైన విత్తనాలు తీసుకోవాలని కోరారు. తప్పనిసరిగా ఈ – క్రాప్ చేయించుకోవాలని చెప్పారు. ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ మాట్లాడుతూ… గత సంవత్సరం మార్కేట్ ను దృష్టిలో ఉంచుకుని రైతులు కౌలుకు భూములు, బ్యారన్ లు తీసుకోవద్దని, ఒక్కోక్క బ్యారన్ కు 3550 కేజీలు మాత్రమే అనుమతి ఉన్నందుకు రైతులు విస్తారంగా పొగాకు సాగు చేయవద్దని కోరారు. బోర్డు మెంబర్ ఎం సుబ్బా రెడ్డి, వై వెంకట శేషయ్య , ఒంగోలు -1 ఒంగోలు-2 , వెల్లంపల్లి పొగాకు బోర్డు అధికారులు రైతులు పాల్గొన్నారు.



