సమాజంలోని అన్ని వర్గాల పేదలంతా ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని రిటైర్డ్ కలెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన ముండ్లమూరులోని ఎస్సీ కాలనీ వద్ద అంబేద్కర్ వద్దగల మంగళవారం రాత్రి ఐక్యత విజయ పదం యాత్ర సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐక్యత విజయ పదం యాత్ర సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్ర యొక్క లక్ష్యం ప్రతి అడుగు పేదల కోసమే అన్నారు. పేదల నుంచి వచ్చిన ప్రతి సమస్యను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఆర్థిక పర మైన ఇబ్బందులు పడుతూ రోజువారి కూలి పనులు చేస్తూ బ్రతుకుతెరువు కొనసాగిస్తున్న వారు ఆర్థిక సామాజిక వివక్షతకు గురవుతున్న వారిని పట్టించుకున్న నాథుడే లేడని అన్నారు. వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించేందుకు అనగారిన వర్గాలలో చురుకుగా ఉన్నవారు అండగా నిలవాలన్నారు. రాజ్యాంగపరమైన హక్కులు కాలరాస్తూ వారి మనోభావాలు దెబ్బతినేలా పెత్తందారులు పెత్తనం చేయటం మనమందరం గమనించాలన్నారు. చట్టపరమైనరాజ్యాంగపరమైన పదవులు అనుభవిస్తున్నప్పటికీ ఆయా రాజకీయ పరిణామాల ప్రభావంతో ఆర్థిక సామాజిక రాజకీయంగా ఇబ్బందులు పెట్టడం మానుకోవాలన్నారు. భూమి సాగు చేసుకుంటున్నప్పటికీ ఆ భూమిపై సరైన హక్కులు లేకపోవడంతో మేలు జరగలేదన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి ఉద్యోగాలు లేక పోవడంతో నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు అన్నారు. కష్టాల్లో ఉన్న పేదల తరఫున, వివక్షతకు గురవుతున్న వారి తరఫున నిలబడి వారి పక్షాన ప్రశ్నించేందుకుపనులు చేయడమే ఐక్యత విజయ పదం లక్షమన్నారు .ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు, పాలెపోగు డ గ్లస్ ,విఠలాపురం మాజీ సర్పంచ్ పాలే పోగు విజయ రాజు, అంబటి వెంకటేశ్వర రెడ్డి, దార్ల కోటేశ్వరరావు, గోపనబోయిన పిలుపు రాజు, గోపనబోయిన వెంకటరావు, కూడలి పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు


