ప్రజల ఆరోగ్య భద్రత సీఎం జగన్ లక్ష్యం

ప్రజల ఆరోగ్య భద్రత కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని సర్పంచ్ వరగాని బాల సుందర రావు, వైసీపీ మండల కన్వీనర్ బిజ్జం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. మండలంలోని పసుపుగల్లు గ్రామంలో గల సచివాలయం వద్ద మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భద్రత నిస్తున్నారన్నారు. ఈ వైద్య శిబిరాలలో కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో మంచి ఖరీదైన మందుల తో వైద్యం చేస్తున్నారన్నారు. గతంలో జబ్బు చేస్తే చికిత్స చేయించుకోవడానికి ప్రజలు అనేక ఇబ్బందుల కు గురయ్యే వారన్నారు. నేడు పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నదే సీఎం జగన్ మోహన్ రెడ్డి అభిమతమని అన్నారు. ఈ శిబిరంలో 430మందికి వైద్యాధికారులు బి మధు శంకర్, వి జ్యోతి వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా గుండె సమస్యలు వారికి 104 లో ఈసీజీ లు నిర్వహించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి వైద్యులు ఏ నరసింహారావు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి కన్యాకుమారి, హెల్త్ సూపర్వైజర్ సుబ్బారావు, ఫార్మసిస్ట్ యుగంధర్, ల్యాబ్ టెక్నీషియన్ నాగార్జున, దిలీప్, ఎంఎల్ హెచ్ ఓ స్వప్న, నందిని, నాగలక్ష్మి, అనిషా, యెహోషువ, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *