పాడి రైతులు పెయ్యదూడల పథకంపై అవగాహన కలిగి ఉపయోగించుకుని ఆర్ధికంగా వృద్ధి చెందాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె బెబీ రాణి కోరారు. ఒంగోలు డిఎల్ డీఏ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో ఆర్చీసీ మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్త సహకారంతో పాడి రైతులకు కార్యసాల (విజ్ఞాన శిక్షణ) నిర్వహించారు. జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్ కే. బేబి రాణి మాట్లాడుతూ… జిల్లాలోని పాడి రైతులు పడ్డదూడల పథకం ద్వారా కృత్రిమ గర్భధారణ ద్వారా ఆడదూడలు పుట్టే వీర్యాన్ని జిల్లాలో సరఫరా చేస్తున్నామని పాడి రైతులు పెయ్యదూడలు పొంది వాడిని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అందుకు తగిన విధంగా కృషి చెయ్యాల్సిన విధానాన్ని వివరించారు. డీఎల్డీఏ చైర్మన్ కోసూరి రాధ మాట్లాడుతూ… జాతి అభివృద్ధి కొరకు కృత్రిమ గర్భధారణ పథకం పశువులలో చాలా ఉపయోగపడుతుందని అన్నారు. పథకంలో నమోదు తర్వాత తర్వాత పాడి పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. డీఎల్డీఏ కార్యనిర్వాహణ అధికారి డాక్టర్ కాలేషా, ఒంగోలు ఉపసంచాలకులు డాక్టర్ ఏ. రమేష్ బాబు, నాగులుప్పలపాడు సహాయ సంచాలకులు డాక్టర్ నాగభూషణం, డీఎల్డీఏ పశువైద్యులు డాక్టర్ డి. క్రిష్ణారావు, గుంటూరు ఆర్ హెచ్ టి సి పశువైద్యులు డాక్టర్ శ్రీనివాస రెడ్డిలు పాల్గొని పశుపోషకులను సూచనలు చేశారు.



