మహిళా రైతు ఉత్పత్తి
దారుల సంఘాలకు గురువారం మూడు కోట్లరూపాయల రుణాలు అందజేశారు. తాళ్లూరు కెనరా బ్యాంకు పరిధిలోని 60 గ్రూపులకుగానూ
ఈ రుణాలు మంజూరు చేసినట్లు మండల వ్యవ
సాయాధికారి ప్రసాదరావు తెలిపారు. మండలం
లో 146 మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు
ఉన్నాయన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన
మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కూడా
బ్యాంకు రుణాలిస్తామని తెలిపారు. బ్యాంకులు
మంజూరు చేసిన రుణాలను మహిళా రైతులు
పంటల సాగుకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏపీఎం దేవరాజ్, బ్యాంకు అధికారులు,
వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
