విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ భవాని హర్ష ఆధ్వర్యంలో దర్శి పట్టణంలో పొదిలి రోడ్డులో గాంధీనగర్లోని పాల కేంద్రంపై ఆక స్మికంగా దాడిచేశారు. నిర్వాహకుడైన యేరువ పుల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. రైతులనుంచి కొద్దిమొత్తంలో పాలను కొని కల్తీ చేసి స్థానికంగా ఉన్న వెంకటరమణ, మోహన్ డెయిరీలకు విక్రయిస్తున్నాడన్నారు. నమూ నాలను సేకరించి ల్యాబ్ కు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై 26(2), 27, 51, 49 సెక్షన్ల కింద ఒంగోలు జేసీ కోర్టులో కేసు నమోదు చేయటంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. దాడుల్లో సీఐ రాఘవరావు, ఎస్సై నాగేశ్వర రావు, ఆహారభద్రతాధికారి నరసింహుడు, వీఆర్వో, సిబ్బంది పాల్గొన్నారు.

