తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకు రావాలని మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు అన్నారు. మండలంలోని శంకరాపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటకు రావాలని కోరుతూ అద్దంకి నాంచారమ్మ ఆలయంలో పొంగళ్ళు పొంగించి స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం ఆ గ్రామ సర్పంచి కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు త్వరగా బెయిల్ పై బయటకు రావాలని పూజలు చేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబును జైలులో పెట్టారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళతామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు చమర గీతం పాడేందుకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కుట్ర రాజకీయాలకు చమరగితం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానం నాగేశ్వరరావు, మేదరమెట్ల రాంబాబు, పోలవరపు మస్తాన్, మందలపు శ్రీనివాసరావు, గమిడి హనుమంతరావు, మేడికొండ పూర్ణాంజనేయులు,కుంటా నాగేశ్వరరావు, మేడికొండ రామాంజనేయులు, పోలవరపు నాగేశ్వరరావు, అన్నపురెడ్డి లక్ష్మి రెడ్డి, బండి అనిల్, ఇంటూ రీ నాసరమ్మ, మందలపు రమణమ్మ, కూరపాటి కోటేశ్వరి, గాడిపర్తి హనుమాయమ్మ, మందలపు సీతమ్మ, గమిడి కవిత , మందలపు సుమతి, కూరపాటి కుమారి, తదితరులు పాల్గొన్నారు.



