భారతీయ జనతాపార్టి, అఖిల భారత విద్యార్ధి పరిషత్ నాయకులు దేవరపల్లి కృష్ణారెడ్డి (చిట్యాల) మంగళవారం పరమపదించారు. వారి స్వగ్రామం బి.నిడమానూరులో బుధవారం నిర్వహించిన అంత్యక్రియల కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బిజేపి అధ్యక్షులు పీవీ శివారెడ్డి పాల్గొని దివికేగిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారికుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ డి శివాజీ, ఒబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు తానికొండ సురేష్ యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రాము, జిల్లా స్కిల్ ఇండియా కన్వీనర్ పిన్నింటి తిరుమలరావు తదితరులు దేవరపల్లి కృష్ణారెడ్డి పార్ధివదేహమునకు పూలు సమర్పించి నివాళులు అర్పించారు.

