తాళ్లూరు మండలంలో శివరామపురంలో వైఎస్సార్సీపీ నాయకుడు అనపర్తి బ్రహ్మయ్య, వెంకాయమ్మ కుమారుడు వెంకట్రామయ్య, బ్యూలాల వివాహ మహోత్సవానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లు హాజరై దీవేనలు అందించారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ మహోత్సవ శుభాకంక్షలు తెలిపారు. వివాహానికి విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలకు వైఎస్సార్సీపీ శ్రేణులు, బ్రహ్మయ్య, అనపర్తి యోహాన్, సర్పంచి రాములు, ఉప సర్పంచి నారి పెద్ది రామ్మూర్తి, బంధు మిత్రులు ఘన స్వాగతం పలికారు.
మాజీ ఎంపీపీలు కోట రామి రెడ్డి, పోకం మధుసూధన రెడ్డి, గోళ్లపాటి మోషే, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, సర్పంచిలు కెఎస్ వెంకటరామి రెడ్డి, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, పార్టీ సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, ఆలోకం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.





