దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ అమర వీరుల వారోత్సవాలను పురష్కరించుకుని దర్శి సర్కిల్ ఆఫీస్ లో గురువారం పోలీసుల రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వైద్యుల పర్యవేక్షణలో పలువురు యువకులు, జర్నలిస్ట్లు, పోలీసులు రక్తాన్ని దానం చేసారు. దర్శి సీఐ రామకోటయ్య మాట్లాడుతూ …. రక్తదానం మహాదానం అని రక్తదాన శబిరం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నగర పంచాయతీ కమిషనర్ ఉమామహేశ్వరరావు పాల్గొని రక్త దాతలకు సర్టిఫికెట్స్ అందజేశారు .కార్యక్రమంలో దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు ఎస్సైలు రామక్రిష్ణ, యూవీ క్రిష్ణయ్య, వైవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


