భక్తిశ్రద్ధలతో వేణుగోపాలస్వామి విగ్రహ ప్రతిష్ఠ – ప్రత్యేక పూజలలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి

కురిచేడు మండలంలోని పడమర గంగవరం పంచాయతీ పరిధిలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి విగ్రహ, కలశ, జీవధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. పురాతన కాలం నాటి ఆలయం జీర్ణావ స్థకు చేరటంతో ఆలయ జీర్ణోద్ధరణ చేసి మూడు రోజులుగా నూతన విగ్రహ, కలశ, యంత్ర, జీవధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డా బూచేపల్లి శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథులుగా హాజర య్యారు. వారికి గ్రామ సర్పంచ్ కాసు భాస్కరరెడ్డి, జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, ధనిరెడ్డి వెంక టరెడ్డి, గోగులమూడి లింగారెడ్డి, ఎంపీటీసీ అన్నెం అరుణ, మాజీ జెడ్పీటీసీ వరికూటి వెంకటేశ్వర్లు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న దానం చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *