తాళ్లూరు మండలంలో వరిసాగు చేసిన రైతులు ఉల్లికోడు తెగులుపై అప్రమ త్తంగా ఉండాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. క్షేత్ర పర్యటనలో భాగంగా శని వారం తురకపాలెం, రమణాలవారిపాలెం లో వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 3785 ఎక రాల్లో వరి సాగుచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వరిలో ఉల్లికోడు తెగులు ఉందన్నారు. దాని నివా రణకు ఎకరాకు కార్బోప్యూరాన్ 3జి గుళికలు 16 కేజీలు లేదా ఫోరేట్ 10జి గుళికలు ఐదు కేజీలు చల్లాలన్నారు. ఆయన వెంట వీఏఏ నవీన్, రైతులు పాల్గొన్నారు
