సామాన్యులకు సైతం చట్టాలపై అవగాహన కల్పించేందుకే గ్రామ స్థాయిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి సామాన్యులకు సైతం చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సీవి రామక్రిష్ణారావు అన్నారు. చదలవాడ గ్రామంలో ఆదివారం రాత్రి ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సీవీ రామక్రిష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన లేక పోతే ఆర్థికంగా, సామాజికంగా అనేక ఇబ్బందులు ఉంటాయని సమాజంలో చట్టాలపై అవగాహన ఉన్న వారు భరోసాతో జీవించవచ్చని అన్నారు. ప్రజా వేదికపై మాట్లాడటం ద్వారా మంచి న్యాయవాదులుగా తయారు అవుతారని చెప్పారు. ప్రిన్సిపాల్ కె నటరాజ్ కుమార్ మాట్లాడుతూ…. ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న కుల గణనతో ప్రతి పుట్టుకకు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు జత చేస్తారని అందువలన భవిష్యత్లో న్యాయ వ్యవస్థ కు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. చదలవాడ గ్రామ సర్పంచి వర ప్రసాదరావు మాట్లాడుతూ… మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలపై అవగాహన చేసుకుని జీవించాల్సి ఉంటుందని అన్నారు. ఎంపీటీసీ పమిడి ముక్కల శివ క్రిష్ణ మాట్లాడుతూ… చట్టాలపై అవగాహన కల్పించే మంచి కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. సంవత్సరంలో కనీసం రెండు సదస్సులు నిర్వహించాలని కోరారు. ఆగ్రోస్ ఎడీ సాయి | మురళీ మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు అవసరమైన మంచి కార్యక్రమం న్యాయ విద్యార్థులు ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సుంకర సాయి బాబ మాట్లాడుతూ… నేడు ప్రతి విషయం న్యాయబద్ధత, చట్టబద్ధతపై ఆధారపడి ఉందని చట్టాలపై అవగాహన కలిగినట్లయితే సమాజంలో ముందుకు సాగవచ్చని అన్నారు.
న్యాయ విద్యార్థులు గ్రామస్తులకు విద్యాహక్కు చట్టం, లోక్ అదాలత్, మోటార్ వెహికల్ చట్టం,బాల్యవివాహాల నియంత్రణ చట్టం, ఫోక్స్ చట్టం, ఫ్రాంసరీ నోటు వ్రాయించుకునే విధానం, భూ పత్రాల బదలాయింపు, ఇతర చట్టాలకు గురించి అవగాహన కల్పించారు. మంచి కార్యక్రమాన్ని తమ గ్రామంలో నిర్వహణకు ఎంపిక చేసుకోవటంపై స్థానిక సర్పంచి, ఎంపీటీసీలు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మంచి కార్యక్రమం నిర్వహించినందుకు న్యాయ శాస్త్ర విద్యార్థులకు అభినందనలు తెలిపారు. న్యాయ విజ్ఞాన సదస్సు సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసారు.

