దీపావళి మందులు అమ్ముకునేందుకు తాత్కాలిక లైసెన్స్లు తీసుకున్న వారు అమ్మకాల సమయం లో అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి సూచించారు. దర్శి పోలీస్ స్టేషన్లో దీపావళి మందుల అమ్మకందారులతో సోమవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. షాపులు దూరం…దూరంగా పెట్టుకుని అగ్ని ప్రమాదాలు వంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దుకాణాలు పక్కన నీటి నిల్వలు ఉం చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై రామకృ ష్ణ, తదితరులు పాల్గొన్నారు.
