ఒంగోలు -2 పొగాకు బోర్డు ఆధ్వర్యంలో మంగళవారం పొగాకు సాగు చేయు రైతులకు ఐదు వేలు బంతి మొక్కలు పంపిణీ చేసారు. ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ మాట్లాడుతూ పొగాకు పంటలో ట్రాప్ క్రాప్ కోసం ఈ సంవత్సరం 50వేల బంతి మొక్కలను పంపిణీ చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. కరువది, ఒంగోలు, త్రోవగుంట, మద్దిరాల పాడు, చెకుపపాడు, ఇనమన మెల్లూరు రైతులకు బంతి మొక్కలను అందించారు. ఫీల్డ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
