అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల మనసును గెలుచుకున్న పార్టీ BRS పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద పలువురు మంత్రి సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యధిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. పేదింటి ఆడపడుచు పెండ్లికి ఒక లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితులై అనేకమంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు. బేగంపేట కు చెందిన నాని ఆధ్వర్యంలో TDP నాయకులు అన్వర్, హమీద్, ఫయాజ్, రఘు, బన్సీలాల్ పేటకు చెందిన మనీష్ ఆధ్వర్యంలో సాయినాథ్, సుభాని, సాయి సాగర్, కృష్ణ మరో 10 మంది BRS లో చేరారు.

