జీవన్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ప్రచారం రథం సడల్ బ్రేక్ వేయటంతో వాహనంపై రెయిలింగ్ ఊడి ఒక్కసారిగా మంత్రి కెటిఆర్, ఎంపీ సురేష్ రెడ్డి అనుచరులు ప్రచార రథం ముందు బాగానికి ఒక్కసారిగా వాలారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు అవాక్కయ్యాయి. అదృష్ట వశాత్తు భారత రాష్ట్ర సమితి (బి. ఆర్. ఎస్) వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కెటీఆర్ కు, ఎంపీ సురేష్ రెడ్డి, ఇతర అనుచరులకు ఎటువంటి ప్రమాదం జరగగ పోవటంతో కార్యకర్తలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు, అభిమానులు ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి కెటీఆర్ కోరారు. కార్యక్రమం అనంతరం కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు మంత్రి కెటీఆర్ బయలు దేరి వెళ్లారు.
