ఆంధ్రప్రదేశ్ మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మిని గురువారం రాష్ట్ర మెప్మా కార్యాలయంలో వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కలిగి దివ్యాంగులు ఎదుర్కోంటున్న పలు సమస్యలను వివరించి పరిష్కరించాలని విన్నవించారు. రాష్ట్రంలో పలు జిల్లాలలో మెప్మా ద్వారా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారి ఆర్ధిక అభివృద్ధికి చేయూతను అందించాల్సిన మెప్మా డైరెక్టర్లు, సిటీ మిషన్ మెనేజర్లు, కమ్యునిటి ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్లు దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను చిన్నచూపు చేస్తూ జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం -2016 ప్రకారం వరాఇని వివక్షతన గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రతి 15 టౌన్ వికలాంగుల సమాఖ్యల ద్వారా ఒక ఆర్పీని ఏర్పాటు చేసి దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించటానికి పనిచెయ్యాలని కోరారు. జగనన్న మహిళా మార్ట్ ఇతర అవకాశాలను కల్పించాలని కోరారు. దివ్యాంగ మెప్మా సిబ్బందిని పదే పదే కారణం చూపకుండా ఇష్టం వచ్చినట్లు దివ్యాంగుల హక్కుల చట్టానికి విరుద్ధంగా తీవ్ర వత్తిడికి గురిచేస్తున్న ప్రకాశం జిల్లాలో జరిగిన సంఘటనతో పాటు పలు సంఘనలు వివరించారు. ఆయా విషయాలను సమగ్రంగా పరిశీలించి న్యాయం చెయ్యాలి. విన్నవించారు.

