ఉచిత రేషన్ పంపిణి మరో ఐదేళ్లు పొడిగింపు – ప్రధాని మోదీ నిర్ణయానికి పివి శివారెడ్డి హర్షం

ప్రధాని మోదీ కి దేశం పట్ల, పేద ప్రజల పట్ల ఉన్న అత్యంత ఉన్నతమైన భావాన్ని వారు అమలు చేస్తున్న పథకాల వల్ల తేటతెల్లమవుతుందని ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పీవీ శివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు దేశంలోని చిట్టచివరి పౌరుల వరకు ప్రభుత్వ పథకాలను చేరే విధంగా అంత్యోదయ పథకాలను ఏర్పాటు చేశారని ఏ ఒక్కరు అన్నము లేకుండా అలమటించకూడదనే భావనతో గత రెండేళ్లుగా ఇస్తున్నటువంటి ఉచిత రేషన్ బియ్యాన్ని మరో ఐదేళ్లపాటు పెంచడం పట్ల శివారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆహార భద్రత చట్టం ప్రకారం కరోనా సమయంలో దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించాని, దానికై 28 నెలల్లో రూ. 1.80 లక్షల కోట్లను ఖర్చుచేశారని వివరించారు. ఇట్టి పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోడీ తెలపడం ఎన్నికల వాగ్దానం కాదని దేశ ప్రజల పట్ల గౌరవ భావాన్ని తెలుపుతుందని పేద ప్రజల బాధలను అర్థం చేసుకున్నారు. కాబట్టే అద్భుతమైన ఉపయుక్తమైన పథకాలను రూపొందించి దేశంలోని మారుమూల ప్రాంత ప్రజలకు కూడా అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు.

2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. పేదరికాన్ని నిర్మూలించగలమని విశ్వాసం కలిగించామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని అన్నారు. పేదరికం నుంచి బయటపడిన వారే నేడు మోదీకి కోట్లాది దీవెనలు ఇస్తున్నారని తెలిపారు.

ప్రతి పేదవాడు తన పేదరికాన్ని అంతమొందించే అతిపెద్ద సైనికుడిగా మారి మోడీకి తోడుగా ఉండేలా కొత్త విధానాలను రూపొందించారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎంతో ఓర్పు, నిజాయితీతో పని చేస్తున్నదని, ప్రజా సేవకుడు మోడీ, కి ప్రజలందరికీ అందరికీ సోదరుడని అభివర్ణించారు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా పేదలకు ఉచిత రేషన్ అందేలా బీజేపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు. అందుకే వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్ సౌకర్యం కల్పించారన్నారు.

మరో ఐదేళ్లపాటు ఉచిత రేషన్ బియ్యాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పంపిణీ పొడిగించడం పట్ల దేశ ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని, దేశ రక్షణతో పాటు ప్రజల ఆహార భద్రత పట్ల బిజెపి ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో వ్వవహరిస్తుందని పీవీ శివారెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *