విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి జీవీఎల్ సరస్వతి అన్నారు. స్థానిక బీసీ కళాశాల హాస్టల్లో జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్ధులు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు, బాధ్యతలు, విధులు తెలుసుకోవాలన్నారు. సమాజానికి ఉపయోగపడేవిధంగా మంచిగా చదివి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వాకా మంజుల, వార్డెన్ పుల్లారావు, విద్యార్థులు పాల్గొన్నారు.


