ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా 40శాతం రాయితీపై రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయటం జరుగుతుందని, ప్రభుత్వం రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద గురువారం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం వ్యవసాయాధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో చేపట్టారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంపీడీఓ కెవై కీర్తిలు ముఖ్య అతిథులుగా పాల్గొని సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఈ సందర్భంగా గుర్తు చేసారు. కార్యక్రమంలో తాళ్లూరు సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, వైసీపీ పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, సొసైటీ అధ్యక్షులు యాడిక యలమందా రెడ్డి, కుమ్మిత జయరామి రెడ్డి, పలు గ్రామాల సర్పంచిలు వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, బ్రహ్మ రెడ్డి, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూనూరి దేవదానం, కెవీ పాలెం జెసీఎస్ కన్వీనర్ కె విష్ణు, ఎఈఓలు నాగరాజు, రాజ సుందరి, వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.
