రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ కనీ వినీ ఎరుగని విప్లవాత్మక సంస్కరణత, సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న సుపరిపాలనతో ఎపీ మొత్తం హ్యాపీగా ఉందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. దర్శి నియోజక వర్గంలో దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాలలో శుక్రవారం నిర్వహించిన ” వై ఎపీ నీడ్స్ జగన్ ” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సంక్షేమ జాబితాను విడుదల చేసారు. ఆయా గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
బండి వెలిగండ్లలో.. …
అసాధ్యాలను సుసాధ్యం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి మండలంలోని బండి వెలిగండ్ల సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కు జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సచివాలయం పరిధిలో జరిగిన అభివృద్ధి బోర్డును ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామంలో సచివాలయం వద్ద వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ … రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సంచల నంగా మారిందన్నారు. గతంలో చంద్రబాబు పాల నకు ఇప్పటి జగన్ పాలనకు తేడాను ప్రజలు గమని స్తున్నారని చెప్పారు. చంద్రబాబు జన్మభూమి కమిటీ లను పెట్టి ప్రజల సొమ్మను దోచుకుని తన కార్యకర్త లకు దోచి పెట్టి రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్ మార్చారని చెప్పారు. ఎంపీపీ సుధా అచ్చయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ షకీలా అమీనా బాషా, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫి కేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ బత్తినేని వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు వేమి రెడ్డి చెన్నారెడ్డి, కౌన్సిలర్ వీసీరెడ్డి, వై.వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, వై.వెంకట్రావు పాల్గొన్నారు.
కురిచేడు మండలం లో…
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలని, వాటి అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికే సాధ్య మైందని దర్శి శాసనసభ్యుడు డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ అన్నారు. ఏపీకి జగనే ఎందుకు కావాలి కార్యక్ర మంలో భాగంగా ఆయన స్థానిక గ్రామ సచివాలయం -2లో శుక్రవారం సర్పంచ్ కేసనపల్లి కృష్ణయ్య అధ్యక్ష తన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించిన ఘనత జగన్మోహనరెడ్డిదేనన్నారు. 75 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా పథకాలు చేపట్టి వాటిని నేరుగా లబ్ధిదారులకు గ్రామ వలంటీర్లు, గృహసారథులు, సచివాలయ సిబ్బంది ద్వారా చేర్చి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారని కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక స్వేచ్ఛ గురించి పోరాడారని, నేడు మన రాష్ట్రంలో చేసి చూపించారని పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి చేసిన వ్యక్తిని మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుంటే మన జీవితాలు మారతాయని తెలిపారు. ప్రజల అవసరాలను అడగకుండా గ్రహించి వాటిని ప్రజలకు అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్ మోహనరెడ్డి అని దర్శి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కేసన పల్లి నాగేశ్వరరావు తెలిపారు. మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి మరో 30 సంవ త్సరాలు వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన అవసరముం దని, దర్శికి మద్దిశెట్టి అవసరముందని పేర్కొన్నారు. ఎస్సీ సెల్ కన్వీనర్ దేవప్రసాద్, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ సైదా, దర్శి ఏఎంసీ వైస్ చైర్మన్ కండె గంగయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైవీ సుబ్బయ్య, సర్పంచ్ కేసనపల్లి కృ ష్ణయ్య, ఎంపీటీసీ బుల్లం వెంకటనర్సయ్య మాట్లాడారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ కానాల శివారెడ్డి, జేఏసీ కన్వీనర్ మేరువ సుబ్బా రెడ్డి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ నిమ్మకాయల రాజయ్య, పడమరగంగవరం, కల్లూరు సర్పంచ్లు కాసు భాస్కర రెడ్డి, నక్కా రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ కాశయ్య, మాజీ జెడ్పీటీసీ వరికూటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ముండ్లమూరు మండలం లో….
రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మో
హనరెడ్డి ఆంధ్రప్రదేశ్ కు అవసరమని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. మండలం లోని పసుపుగల్లు సచివాలయం వద్ద శుక్రవారం రాత్రి వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అం టే ప్రజల కోసమే అనే నినాదంతో సీఎం పరిపాలన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. నాడు-నేడుతో గ్రామాల్లో రూపురేఖలు మారాయన్నారు. జగ నన్నను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే మరో 25 ఏళ్లు తిరుగుండదన్నారు. సచివాలయ డిజిటల్ అసిస్టెం ట్ జెస్సీ నాలుగన్నరేళ్ల జగనన్న పాలనలో గ్రామానికి రూ.26 కోట్ల లబ్ది చేకూరినట్లు పథకాల వారీగా చదివి వినిపించారు. అనంతరం వైఎస్సార్ సీపీ జెండాను ఆవిష్కరించి దివంగత ముఖ్యమం త్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మారెడ్డి, జేసీఎస్ మం డల కన్వీనర్ మేడికొండ జయంతి, సర్పంచ్ బాల సుందరరావు, ఎంపీటీసీ పెద అంజయ్య, వైస్ ఎం పీపీ వేముల పద్మావతి జానకిరామయ్య, నాయ కులు ఏఎం.సి డైరెక్టర్ అన్నపురెడ్డి భిక్షాలరెడ్డి, పాలెపోగు డగ్లస్, మిల్లర్ బుజ్జి, జనమాల పిచ్చయ్య పాల్గొన్నారు.







