20 లోపు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి

2024 మార్చి/ ఏప్రిల్లో నిర్వహించే పదో తరగతి పరీక్షల ఫీజును ఈనెల 20వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా చెల్లించ వచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 25వ తేదీలోపు, రూ.200 అపరాధ రుసుముతో ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉందన్నారు. రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 5వ తేదీలోపు చెల్లించవచ్చని, పరీ క్షకు సంబంధించిన ఫీజును సీఎఫ్ఎంఎస్ ద్వారానే చెల్లించాలన్నారు. ఆన్లైన్ అప్లికేషన్స్ లింక్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీవో వీ.ఇన్ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంద న్నారు. ప్రధానోపాధ్యాయులు తమకు కేటా యించిన యూజర్ ఐడీ, పాస్వర్డు ద్వారా లాగిన్ కావాలని డీఈవో సూచించారు. మూడు సబ్జక్టులకు తక్కువైతే రూ.110, మూడు సబ్జక్టులకు మించితే రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. మైగ్రేషన్ సర్టిఫికెట్ అవసరం అని భావించిన విద్యార్థులు రూ.80 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *