దీన దయాల్ స్పర్ష్ యోజనకు భారీ స్పందన – ఎంపిక కాబడిన విద్యార్థులు రెండవ దశకు ప్రాజెక్టును పంపండి – జిల్లా పోస్టల్ సీనియర్ సూపరిండెంట్ హరి ప్రసాద్ శర్మ

దీన దయాల్ స్పర్ష్ యోజన పోటీపరీక్షలకు విద్యార్థుల నుండి మంచి స్పందన వచ్చిదని విజయం సాధించిన విద్యార్థులకు, పొత్సహించిన తల్లిదండ్రులకు జిల్లా పోస్టల్ సీనియర్ సూపరిండెంట్ హరి ప్రసాద్ శర్మ అభినందనలు తెలిపారు. ఈ పోటీ పరీక్షకు ఆంధ్ర ప్రదేశ్ నుండి 6,384 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో ప్రకాశం పోస్టల్ డివిజన్ నుండి 484 మంది విద్యార్థులు హాజరు అయినట్లు చెప్పారు. అందులో మొదటి దశ ఫలితాలలో ఆంధ్ర ప్రదేశ్ నుండి 173 మంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో ప్రకాశం పోస్టల్ డివిజన్ నుండి 26 మంది విద్యార్థులు ఎంపిక కావటం విశేమని చెప్పారు. రెండవ దశకు ఎంపిక కాబడిన 26 మంది విద్యార్థులు సేకరణ అధ్యయనం (ఫిలా టెలి) స్టాంప్స్ పై ఇచ్చిన ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టును చేసి ఈనెల 30లోపు చీఫ్ పోస్ట్ మాస్టర్, జనరల్ ఆఫీస్, ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్, విజయవాడకు రిజిస్టర్ పోస్ట్, స్పీడ్పోస్ట్ ద్వారా కాని పంపాలని కోరారు. 6,7వ తరగతి విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ గా 1 తెలుగు సినిమా, 2. యోగా ఫర్ హెల్త్, 3. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ను, 8, 9వ తరగతి విద్యార్థులకు 1 ఇస్రో, 2. ట్రెడిషినల్ ఫుడ్స్ ఆఫ్ ఇండియా, 3. స్పోర్ట్స్ వరల్డ్ ఛాంపియన్స్ ఫ్రమ్ ఇండియా లుగా ఉన్నాయని చెప్పారు. ఇందులో ఎంపిక కాబడిన విద్యార్థులకు దీన దయార్ స్పర్ష్ యోజన స్కాలర్ షిప్ పొత్రాహకంగా సంవత్సరానికి రూ. 6వేల చొప్పున నగదు ఇవ్వబడునని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *