తలసానికి అభినందనల వెల్లువ..సనత్ నగర్ నియోజక వర్గం నంచి హ్యాట్రిక్ కొట్టిన శ్రీనన్న.మారేడ్ పల్లి నివాసానికి తరలి వచ్చిన కార్యకర్తలు..అభిమానులు..మీ అభిమానానకి కృతజ్ఞతలు…మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.

సనత్ నగర్ శాసనసభ్యుడిగా మూడోసారి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అభినందనలు వెల్లువెత్తాయి. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్దకు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు బస్తీలు, కాలనీలకు చెందిన ప్రతినిధులునగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు, సన్నిహితులు పెద్ద ఎత్తున చేరుకొని ఆయనను శాలువాలు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే తాను ఘన విజయం సాధించగలిగానని ఆయన అన్నారు. 2014 తర్వాతనే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎవరికీ ఏ అవసరమొచ్చిన తాను నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు. సనత్ నగర్ కార్పొరేటర్ లు కొలను లక్ష్మి బాల్ రెడ్డి, కుర్మ హేమలత లక్ష్మీపతి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, నామన శేషుకుమారి, సీనియర్ సిటిజన్స్ సభ్యులు, BRS డివిజన్ అద్యక్షులు కొలను బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, అమీర్ పేట డివిజన్ జనరల్ సెక్రెటరీ సంతోష్, నాయకులు లలితా చౌహాన్, హరిసింగ్, కర్ణాకర్ రెడ్డి, లక్ష్మీపతి, ప్రవీణ్ రెడ్డి, సురేందర్ సింగ్, కూతురు నర్సింహ, హమాలీ బస్తీకి చెందిన శ్యాం, PG రోడ్ అసోసియేషన్ అద్యక్షుడు ప్రవీణ్, ఉత్తమ్ సింగ్, గులాబ్ సింగ్, కుమార్ యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *