రాష్ట్రంలో నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. మాటమీద నిలబడే ఏకైక నాయకుడు రాష్ట్రంలో, దేశంలో ఆనాడు దివంగత ముఖ్యమం త్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే ఈనాడు ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎ స్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయస్థాయి ఎడ్లపందేల అనంతరం ఏర్పాటు చేసి విద్యుత్ ప్రభపై వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా మళ్లీ వచ్చి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని టీడీపీ నాయకులను ఉద్దేశించి ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చూశారన్నారు. ఒక్కరూపాయి కూడా దళారులకు చేరకుండా నేరుగా పేదల ఖాతాలకు చేరుస్తున్న సీఎం అభినందనీయుడన్నారు. రానున్న ఎన్నికల్లోమాటపై నిలబడే ఏకైక నాయకుడు సీఎం జగన్ అని,రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. తమ కుటుంబం జగనన్న రుణం తీర్చుకోలేనిదని, తమపై ప్రేమతో అమ్మకు జిల్లా పరిషత్ చైర్పర్సన్, తనకు దర్శిలో పోటీ చేసే అవ కాశం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉం టామని చెప్పారు. షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం
బాషా, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, ఎంపీపీ సుధాఅచ్చయ్య, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదన్ రెడ్డి, ఇత్తడి దేవదానం, గోళ్లపాటి మోషే, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, నాయకులు చంద్రగిరి గురవారెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, కర్ణా శ్రీనివాసరెడ్డి, దామెర్ల చంద్రం, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

