శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డిఎన్పి బి. బాల మురళీ కృష్ణ , సీఐ రామా రావు ఆధ్వర్యంలో తాళ్లూరు మండలంలో ఆదివారం సోమవరప్పాడు పాముల కాలనీ ఏరియాలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దర్శి సీఐ వై. రామారావు నర్కిల్ పరిధిలోని తాళ్లూరు, దర్శి, కురిచేడు. ముండ్లమూరు ఎస్సైలు మల్లికార్జున రావు, ఏడు కొండలు, కోటయ్య, కోటేశ్వర రావు వారి సిబ్బంది కలిసి జల్లెడ పట్టడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ డివైన్ ద్వారా అనుమానితులను చెక్ చేసారు. గంజాయి గురించి, అలాగే మత్తు పదార్థాల గురించి తనిఖీలు చేయడం జరిగింది. అన్ని నివాసాలలో తనిఖీలు చేపట్టి, నరైన డాక్యుమెంట్లు లేని 48 బైకులు, 2 ఆటోలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్ధాలు, సైబర్ నేరాలు కొత్త చట్టాలు మరియు మహిళలపై నేరాలు మరియు శిక్షలు గురించి అవగాహన కల్పించారు. తదనంతరం దర్శి వై రామా రావు ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో స్థానిక ప్రజలందరినీ మమేకం చేసి గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీని నిర్వహించి, తదుపరి అక్కడి యువత, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు, గంజాయిని పారదులుదాం” అంటూ ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాలు వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు, నమాజం మొత్తం నష్టపోతుందని వివరించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువు, క్రీడలు, ఉపాధి వంటి సానుకూల మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్. గంజాయి విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


