వివిధ క్రీడల పోటీలలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో
ప్రతిభ చాటిని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం అభినందన సభ ప్రధానోపాధ్యాయుడు పి. సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో 25 మంది, జాతీయ స్థాయిలో ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చాటేందుకు తగిన శిక్షణ ఇస్తున్న పీఈటి రవి ప్రసాద్ రెడ్డిని అభినందించారు. విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వక్తలు దీవించారు. సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, విశ్రాంత వ్యామాయ ఉపాధ్యాయులు వి ఆంజనేయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
