తనకు వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాంతం రుణ పడి ఉంటానని డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అభ్యరి గా ప్రకటించిన సందర్భంగా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమా వేశం ఏర్పాటు చేశారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గజమాలలతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎవరికి ఏపని కావాలన్నా ఏ నాయకుడితో పని లేదన్నారు. నేరుగా తన ఇంట్లోకి వచ్చి కలిసి మాట్లాడవచ్చని తెలిపారు. తనకు కులాలు లేవు.. మతాలు లేవు.. వైఎస్సార్ సీపీ నా కులమన్నారు. జగనన్న పక్కన అసెంబ్లీలో కూర్చో టానికి కుర్చి ఉంటే చాలన్నారు. జిల్లా పరిషత్ చైరప ర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ తన కుమారుడిని వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ప్రకటించి దర్శి నియోజకవర్గంలో సేవ చేసుకునే భాగ్యం కల్పించినదుకు కృతజ్ఞతలు తెలపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా, కాపా పిచ్చిరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత ఆం జిరెడ్డి, మండల పార్టీ కన్వీనర్లు వెన్నపూస వెంకట రెడ్డి, బిజ్జం సుబ్బారెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, తూము వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీలు గోళ్లపాటి సుధాఅచ్చయ్య, బెల్లం కోటేశ్వరమ్మ, సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, వైస్ ఎంపీపీలు కొరివి ముసలయ్య, సోము దుర్గారెడ్డి, యడమకంటి వెంక టేశ్వరరెడ్డి, జేసీస్ కన్వీనర్లు గుంటు పోలయ్య,
మేరువ సుబ్బారెడ్డి, ఎదురు కోటిరెడ్డి, సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి, ఎంపీటీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీలు గోళ్లపాటి మోషే, ఇత్తడి దేవదానం, పోశం మధుసూదనరెడ్డి, కోట రామిరెడ్డి. జెడ్పీటీ సీలు తాతపూడి రత్నరాజు, నాగిరెడ్డి, సుధాకర్ రెడ్డి, దారం వాసుదేవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చెరుకూరి జగన్, వెంకయ్య పాల్గొన్నారు.


