cVIGIL -మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!*అందుబాటులో ‘సి విజిల్‌’ యాప్‌ – ఇలా 100 నిమిషాల్లో ఫిర్యాదును పరిష్కరిస్తారు

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే..సార్వత్రిక ఎన్నికల(2024)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌) అమల్లోకి వచ్చేసింది. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇందులో పౌరులను సైతం భాగస్వాములను చేస్తోంది. ‘సి విజిల్‌’ యాప్‌ ద్వారా ఈ అవకాశం కల్పించింది. దాని గురించి తెలుసుకుని, నిబంధనలు ఉల్లంఘించే వారి పని పట్టండిలా…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*అసలు.. ఏంటిది..?*

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నాటి నుంచి ఈ ‘సి విజిల్‌’ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో లేదా వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్‌ చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. దీన్ని పౌరులు ఎవరైనా వినియోగించవచ్చు. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

*రిజిస్టర్‌ చేసుకోండిలా..*

ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం వారి ‘సి విజిల్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మీ చరవాణి నంబరు ద్వారా దానిలో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ‘సి విజిల్‌’ యాప్‌ సిద్ధమైనట్లే. దాని ద్వారా మీరు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చు.

*ఎలాంటివి చేయవచ్చంటే…*

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజు ఓటర్లను వాహనాల్లో తరలించడం. ఇలాంటి ఉల్లంఘనలను ఫొటో లేదా వీడియో లేదా ఆడియో రికార్డ్‌ చేసి అప్‌లోడ్‌ చేయండి.

*ఎలా చేయాలంటే…*

మీ యాప్‌ తెరవగానే తెరపై ‘ఫొటో’, ‘వీడియో’, ‘ఆడియో’ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. మీరు ఫొటో ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే ఫోటో ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. మీ లొకేషన్‌ నమోదవుతుంది. ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోను అప్‌లోడ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *