బేగంపేట సెప్టెంబర్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్) :
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు బాలం రాయి శ్రీ శ్రీ శ్రీ దండు మారమ్మ ఆలయాన్ని పలు సంఘాల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ ఆర్య సమాఖ్య అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్, పరశురామ ఆర్య జేఏసీ కన్వీనర్ జయశర్మ, అర్చక సమాఖ్య ప్రతినిధి శ్రీనివాసాచార్యులు ఆలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆలయ పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించిన అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. అనంతరం దేవాదాయ శాఖ డీసీ వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆలయ పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలపై సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్,
పి. రాజు, దళిత రత్న దర్గా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
