ప్రమాదకర 54 రోడ్డుల పై రోడ్డు రావాణా సంస్థ ద్రైవర్లుకు అవగహన కల్పించి ప్రమాదాలు జరుగ కుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు సంబందిత అధికారులకు సూచించారు.
భుదవారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరములో మాదక ద్రవ్యాల విని యోగ నిరోధం, మహిళా సంరక్షణ మరియు రహదారి బద్రత ల పై ఏర్పాటు చేసిన త్రిశూలం కార్యక్రమంలో ఎస్. పి హర్ష వర్ధన రాజుతో పాటు కలసి జిల్లా కలెక్టర్ పి.రాజ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు మాట్లాడుతూ జాతీయ రహదారిపై సి.సి. కెమెరాలు పనిచేసాల అవసరమై తే వై.ఫై వినియోగించుకోవాలని సంబందిత జాతీయ రహదారి అధికారులకు సూచించారు. సమస్యాత్మక ప్రదేశాల నిరంతర పర్యవేక్షణతో పాటు గస్తీ నిర్వహించాలన్నారు. గతంలో కంటే జిల్లాలో తీసుకున్న పలు చర్యల వల్ల మహిళల పై అఘాయిత్యాలు తగ్గాయన్నారు. నషా ముక్త భారత్ పై గ్రామాలాలో అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలనీ జిల్లా పంచాయతి అధికారికి సూచించారు. సమస్యాత్మక ప్రదేశాలలో విధిగా పర్యవెక్షణ ఉండేలా చూడడం ద్వారా ప్రమాదాల నివారణకు అవకాశం ఏర్పడుతుందన్నారు. వన్ హాట్ స్పాట్ వన్ ఆఫీసర్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాల నివారణకు అవకాశం ఏర్పడుతుందన్నారు. త్రిశూల్ కార్యక్రమం పై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి స్కూళ్ళలో కాలేజీలలో అవగాహన కల్పించాలి. అదేవిధముగా జిల్లా వినూత్నముగా నిర్వహిస్తున్న యువ సాథీ కార్యక్రమం ద్వారా త్రిశూల్ కార్యక్రం పై అవగాహన కల్పించే విధముగా గ్రూప్ విద్యార్ధులకు నియమించిన మెంటార్లకు అవగాహన కల్పించి నో బ్యాగ్ డే సందర్బంగా నిర్వహించే కార్యక్రమములో త్రిశూల్ కార్యక్రమం పై అవగాహన పెంపొందేలా చూడాలన్నారు.
ఎస్. పి హర్ష వర్ధన్ రాజు మాట్లాడుతూ జిల్లాలో గాంజా వంటి మత్తు పానియాల వినియోగం, మహిళలపై అకృత్యాలు గణనీయంగా తగ్గాయన్నారు. రహదారి భద్రతలో భాగంగా ప్రమాదాల నివారణకు సుమారు మూడు వందల కాన్వెక్స్(convex mirrors) అద్దాలు వివిధ ప్రాంతాలలో అమర్చడం జరిగిందన్నారు. అలాగా వివిధ ప్రాతాలలో పి.ఎ సిస్టం ద్వారా తెలియ చేయడం జరుగుతున్నన్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చోట అవుట్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శ్రీ శైలం ఘాట్ రోడ్ లో సుమారు 18 కాన్వెక్స్ అద్దాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలు అదుపు చేయడం జరిగిందన్నారు. జాయింట్ యాక్షన్ కమిటి ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. హై వేల పై ముందు జంక్షన్ ఉంది నిదానంగా వెళ్ళండి వంటి సూచనలతో పెయింటింగ్ వేయడం జరిగిందాన్నారు. శక్తి టీము ల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అదే విధముగా ఈగల్ టీములు ఏర్పాటు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమములో కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీ, ఎక్సైజ్ సూపరింట్ డెంట్ ఆయేషా బేగం, రెవిన్యూ డివిజినల్ అధికారులు చంద్ర శేఖర్ నాయుడు, జ్యోతి కుమారి, డి.టి.సి సుశీలా, ఐ.సి.డి.యస్ పి.డి పద్మ సునంద, జిల్లా విద్యా శాఖాధికారి రేణుక, ఒంగోలు మున్సిపల్ కమీషనర్ వెంకట కృష్ణయ్య, డి.పి.ఓ అనుపమ, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.


