ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి జన రంజక పాలన అందించారని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి (వాసు) సతీమణి బాలినేని శచీదేవి అన్నారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తి తో శచీదేవి కార్యక్రమం శుక్రవారం 47వ డివిజన్లో చంద్రయ్య నగర్ ఎన్టీఓ కాలనీ 7,8,9 లైన్స్ వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ఐదేళ్ల పాలనలో ప్రజల వద్దకే పాలనను తీసుకువచ్చి సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి ఇంట్లోంచి బయటకు రాకుండానే ప్రజా సేవలు వలంటీర్ల ద్వారా అందించారని చెప్పారు. నివాసాలు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల సాకారం చేసేందుకు పేదలకు నివాస స్థలాలు అందించారని, మరలా మన అందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నివాసాలు నిర్మించి ఇచ్చేందుకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. పెన్షన్ దారులను పలికరించారు. సకాలంలో ఇబ్బందులు లేకుండా పెన్షన్లు రావాటంటే మన ప్రభుత్వం ఆవశ్యకతను వివరించారు. ఇంటింటికి తిరిగి సంక్షేమాన్ని అభివృద్ధిని మరలా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస రెడ్డికి, ఎంపీగా చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి తమ ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముందుగా చంద్రయ్య నగర్ లోని వినాయకుని గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా డివిజన్ అధ్యక్షుడు చావల శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాలినేని శచిదేవికి పూల మాలలు, బోకేలు అందించి ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చావల శ్రీనివాసులు, ఇన్చార్జి చిట్టెంరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఇప్పాల శివా రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కన్వినర్ కాంతమ్మ, ముఖ్య నాయకులు పుల్లగుజ్జు వేణుమాధవ్(బుజ్జి), కొప్పొలు వెంకటేశ్వర్లు, అల్లూరయ్య, గోపి, మనోజ్, సాదా నరసింహారావు, యర్రంరెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.




