నిరుపేదల జీవన ప్రమాణాలు పెంచటమే అసలైన అభివృద్ధి అని నమ్మి సంక్షేమ పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రిగా, వాసన్నను ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా చేసుకుందామని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు.49వ డివిజన్ పరధిలో శుక్రవారం వైఎస్సార్సీపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి బాస్కర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారానికి శ్రీకారం చుట్టారు. డివిజన్ కార్పోరేటర్ అంగరేకుల గురవయ్య, ఇన్చార్జీ తాళ్లపాలెం శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షుడు గాలం సుబ్బారావు, నాయకులు కసిబిసి నాగేశ్వరరావు, సూరసారి నర్సా రెడ్డి, బత్తుల కాశయ్య, ఢాకా రాఘవ రెడ్డి, గోపిదేశ్ నాగేశ్వర రావు, వీరనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, దిలీప్ కుమార్, అంగిరేకుల బాల గురవయ్య, మల్లిఖార్జున్, జయరాం, షేక్ గౌస్ నాయబ్ రసూల్, అంగిరేకుల నాగేశ్వరరావు, కుర్ర గురు సత్యం, మళ్లీబోయిన వెంకటేష్ తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

