టెర్రరిస్టులను తయారు చేసిన చంద్రబాబు

వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని హత్య చేసిన టీడీపీ కార్యకర్త

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అనంతపురం జిల్లాలో దారుణం.. కంబదూరు మండలం ఎగువపల్లిలో వైసీపీకి ఓటు వేసిందన్న కారణంతో మద్యం మత్తులో కన్న తల్లిని దారుణ హత్య చేసి పరారయ్యాడు.

వడ్డే వెంకటేశులు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో తిరుగుతుండగా తల్లి వడ్డే సుంకమ్మ(45) వైఎస్సార్సీపీ పార్టీకి ఓటు వేసినట్లు కొడుకుతో చెప్పగా కోపంతో ఊగిపోయి మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో గొడవకి దిగాడు. క్షణికావేశంలో కన్న తల్లి తలపై ఇనుప సుత్తితో బాది హత్య చేశాడు.

సమాచారం అందుకున్న కంబదూరు పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *