ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఇక నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దృష్టి సారించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ MLA గా మూడవసారి భారీ మెజార్టీ తో గెలుపొందిన సందర్భంగా అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. బుధవారం సనత్ నగర్ డివిజన్ లోని మోడల్ కాలనీ, అల్లా ఉద్దీన్ కోటి, రాజ రాజేశ్వరి నగర్, అశోక్ కాలనీ, జెక్ కాలనీలకు చెందిన పలువురు ప్రజలు BRS పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి ఆధ్వర్యంలో వెస్ట్ మారేడ్ పల్లి లోని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన నివాసంలో కలిసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శశిధర్ రెడ్డి, కరీం లాలా, సుధాకర్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, ప్రభాకర్, పుష్పలత, పద్మ, సరిత గౌడ్, ఝాన్సీ, జాఫ్రీ మసీద్ అధ్యక్షుడు నోమాన్, జమీర్ ఇబ్రహీం తదితరులు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బన్సీలాల్ పేట డివిజన్ దేవీ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటరమణ, అశోక్ గౌడ్, అమర్నాధ్, అరుణ్ గౌడ్, సత్యనారాయణ, మొండా డివిజన్ పద్మశాలి సంఘం ప్రతినిధులు కంది విశ్వనాధం, రాఘవేంద్ర, జయరాజ్ తదితరులు మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన వారిలో ఉన్నారు.
జెక్ కాలనీ నూతన కమిటీ
ఇటీవల నూతనంగా ఎన్నికైన సనత్ నగర్ లోని జెక్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు బుధవారం మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు నూతన కమిటీ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నూతన కమిటీ సభ్యులకు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడు మల్లు ప్రసాద్, జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ చందు, ట్రెజరర్ శివారెడ్డి, ఇతర కమిటీ సభ్యులు ఉన్నారు.


