స్వామి వివేకానంద మార్గం అనురణీయం.బిజేవైయం ఆధ్వర్యములో ఘనంగా స్వామి వివేకానంద జయంతి.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఉన్న వారి విగ్రహానికి భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు పువ్వాడి దామోదర్ చౌదరి ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. వారి స్ఫూర్తివంతమైన జీవిత కథనమును స్మరించుకొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బిజెపి జిల్లా అధ్యక్షలు పివి శివారెడ్డి మాట్లాడుతూ నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుందని తెలిపి యువతరాన్ని మేల్కొల్పి మన భారతదేశం పోగొట్టుకున్న పూర్వ వైభవాన్ని తిరిగి తేవాలని వివేకనంద చేపట్టిన మహత్కారం సదా అనుసరణీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఇంచార్జ్ బొద్దులూరి ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి తలుపుల నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు నాగ శేషు, జిల్లా కార్యవర్గ సభ్యులు డేగ సురేష్, మీడియా కన్వీనర్ ధనిశెట్టి రామునాయుడు, సోషల్ మీడియా కన్వీనర్ అనిల్, ఒంగోలు అసెంబ్లీ కో కన్వీనర్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *