హిందూ ధర్మం, భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నతులు స్వామి వివేకానంద

  • తడికమళ్ల హరిప్రసాదరావు
  • ఘనంగా స్వామి వివేకానంద జయంతి.

స్వామి వివేకానంద హిందూ ధర్మం, భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావులని తడికమళ్ళ హరి ప్రసాద్ రావు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్, ఆపస్ (ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం) ఆధ్వర్యంలో దామోదర సంజీవయ్య కొత్త కూరగాయల మార్కెట్ లో గల స్వామి వివేకానంద విగ్రహము వద్ద వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన కడికమళ్ళ హరి ప్రసాద్ రావు మాట్లాడుతూ దేశాలన్నీ తిరిగి భారతీయ గొప్పతనాన్ని చాటి విశ్వమంతా భారతం గుర్తించాలని కృషిచేసిన మహోన్నతులు వివేకానందుడని కొనియాడారు రామకృష్ణ పరమహంస శిష్యునిగా మన భారతీయ వేద ఉపనిషత్ సారాన్ని రామాయణ మహాభారత గ్రంథాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచానికి హిందూ ధర్మాన్ని భారతీయ తత్వాన్ని తెలిపారని వివరించారు కార్యక్రమానికి ముందుగా స్థానిక అంజయ్య రోడ్డులోని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం వద్ద నుండి కార్యకర్తలందరూ భారత్ మాతాకీ జై వివేకానంద స్వామి కి జై సనాతన ధర్మానికి జై అని నినాదాలు చేసుకుంటూ ద్విచక్ర వాహనాలపై మార్కెట్ వద్దకు చేరుకొని స్వామివారికి పూలమాలలు సమర్పించారు.

కార్యక్రమంలో సంఘచల రావినూతల రాంప్రసాద్ ఆపస్ మల్లికార్జున్ రావు మరియు వివిధ సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *