హరి ప్రసాద్ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. అమీర్ పేట లోని బుద్దా నగర్ కు చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. ఆదివారం. వివేకానంద కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన దశదిన కర్మకు హాజరై హరిప్రసాద్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. పార్టీ కార్యక్రమాలకు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యే హరిప్రసాద్ మరణం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు అశోక్ యాదవ్, సంతోష్ కుమార్, కూతురు నర్సింహ, హరిసింగ్ తదితరులు ఉన్నారు.

