గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కల్గిస్తే కఠిన చర్యలు – తాళ్లూరు ఎస్సై వైవి రమణయ్య

గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవని తాళ్లూరు ఎస్ఐ వైవీ రమణయ్య హెచ్చరించారు. ఆదివారం తాళ్లూరు పోలీస్ స్టేషన్లో కొర్రపాటివారిపాలెం, తాళ్లూరు, తదితర గ్రామాలకు చెందిన ఇరుపార్టీల నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో చిన్న, చిన్న విషయాలపై అనవసర రాద్దాంతాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా, అసాంఘిక చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా గ్రామాల్లో శాంతికి విఘాతం లేకుండా చూడాలని, లేకుంటే చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *