తాళ్లూరు మండలం వెలుగు వారి పాలెం కు చెందిన హిందీ మాస్టర్ చిన్నయ్యకు ఉగాది జాతీయ పురస్కారం – పలువురికి పురస్కారాలు ప్రదానం:

తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెంకు చెందిన హిందీ మాస్టర్ గర్నెపూడి చిన్నయ్య కు ఉగాది జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆదివారం ఘనంగా సత్కరించింది. చిన్నయ్య తాళ్లూరు లోని ఏబీసీ హై స్కూల్ లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కీబోర్డ్ ప్లేయర్ గా ఆయనకు ప్రావీణ్యం వుంది. దీనిని గుర్తించిన సాహితీ వేదిక చిన్నయ్యను ఉగాది జాతీయ పురష్కారానికి ఎంపిక చేసింది. ఆదివారం ఒంగోలులో జరిగిన పుర స్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పలువురికి పురస్కారాలు ప్రదానం:

తెలుగు వెలుగు నిర్వహించిన ఉగాది సాహితీ సాంస్కృతిక జాతీయ పురస్కారాలలో పలువురికి పురస్కారాలు అందించారు. ముండ్లమూరు మండలం మారెళ్లకు చెందిన కోలాటం మాస్టారు పూరిమెట్ల యల్లయ్యకు,తాళ్లూరు మండలం లింగాలపాడుకు చెందిన హార్మోనియం కళాకారుడు వేమర్తి శ్రీనులను సత్కరించి అవార్డు అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు వంద మందిని ఎంపిక చేసి సత్కరించారు.
కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహితీ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అప్పినపల్లి భాస్కరాచారి, వ్యవస్థాపక చైర్మన్ పి.రాజ్ కుమార్ , రాష్ట్ర కన్వీనర్ తులసి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *