ప్రకాశం జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తూర్పుగంగవరం పంచాయతీ పరిధిలోని గుంటిగంగ సన్నిధిలో ఆదివారం గుంటి గంగా భవానీ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. పలుప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి కరు ణించమని వేడుకున్నారు. తాళ్లూరు పరిసర మండల గ్రామాలకు చెందిన భక్తులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చు కునేందుకు రావటంతో భక్తులతో సందడిగా మారింది. ఆలయ బ్రాహ్మణ అర్చకులు ఎన్.కామేశ్వర శర్మ, పూజారులు ప్రకాశ్ రావు, విజయలక్ష్మిలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి ఎం.భాస్కర్ రెడ్డి కుటుంబసభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పి.కార్తిక్, ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, ఆర్ ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఆలయంలో లలితాసహస్రనామ పూజలు జరుగనున్నందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈవో కార్తీక్ కోరారు.
