ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొర్రపాటి వారి పాలెం గ్రామానికి చెందిన రైతు కోట పెద శేషయ్యకు చెందిన రెండు గెదేలు సోమవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందాయి. పొలంలో మేత కోసం వెళ్లిన శేషయ్య గెదేలు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తగలటంతో షాక్కు గురై అక్కడి కక్కడే మృతి చెందాయి. గమనించిన రైతు అటుగా వెళ్లి తప్పించబోగా అతనికి కూడ స్పల్ప గాయాలు అయ్యాయి. అదృష్టవశాత్తు విద్యుత్ ట్రిప్ కావటంతో పెను ప్రమాదం తప్పింది. మృతి చెందిన గెదేల విలువ రూ. 2లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. సంఘటన వివరాలను బాధిత రైతులు, బంధువులు విద్యుత్, పోలీస్ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు.
