పాతాళ పంచముఖ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలపై వుండాలి..కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్.

పాతాళ పంచముఖి వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలపై వుండాలనీ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ అన్నారు.శనివారం కంటోన్మెంట్ వార్డ్ 3 లోని పాతాళ పంచముఖి వీరాంజనేయ స్వామి ఆలయం లో శ్రీ గణేష్ బోయిన్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి గోపాల్ తో కల్సి స్వామి ఆలయం లో నిర్వహించిన మహా పూజలో పాల్గొన్నారు. వార్డ్ – 3 అన్నా నగర్ లో నీశ్రీ శ్రీ శ్రీ పాతాళ పంచముఖ వీరాంజనేయ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి దీక్ష పరులతో మహా పూజ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, దీక్షపరులు, దర్గా రవికుమార్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *