ఎగ్జిట్పోల్స్ ఫలితాలు రానేవచ్చాయి. రాష్ట్రంలో చూస్తే నువ్వానేనా అన్నట్లుగానే ఫలితాలు ఉంటాయని పలు సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ప్రముఖ టీవీ ఛానల్లో ఒక స్థానం అటూఇటూగా చెరి సగం పార్లమెంటు స్థానాలు ఇవ్వడంతో పాటు పోటీ గట్టిగా ఉందని వెల్లడించింది. కొన్ని సంస్థలు కూటమికి స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 71 |-నుంచి 84 స్థానాలు వస్తాయని అం చనా వేశారు. వైసిపికి 94 నుంచి 104 వస్తాయని అంచనా వేసాయి.
అయితే ఎక్కువ సం స్థలు తెలుగుదేశం కూటమికే ఓటర్లు పట్టం కట్టనున్నట్లు చెబుతున్నాయి. ఎవరి భవితవ్యం ఎలా ఉందో చూడాల్సి ఉందే. అయితే వైసిపికి అనుకూలంగా చెప్పిన సంస్థలు అనుకూలంగా ఎగ్జిట్ ఫలితాలను వెల్లడిం చగా.. మరికొన్ని మాత్రం వైసిపికి ఫలితాలను చూస్తే నువ్వానేనా అన్నట్లుగానే కూలంగా జనం తీర్పు ఉంటుందని తేల్చాయి. రాష్ట్రంలో గతం నుంచి సర్వేలు చేస్తున్న చాణక్య, పీపుల్స్ పల్స్, పయనీర్ వంటి సంస్థలు మాత్రం తెలుగుదేశం కూటమికి అధికారం రాబోతోందని వెల్లడించాయి. ఈ సంస్థలు -100 నుంచీ 130కి పైగా సీట్లు తెలుగుదేశం కూటమికి వస్తాయని అంచనా వేశాయి. మీడియా సంస్థలు ఇప్పటి వరకూ ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో ఆ పార్టీలకే అధికారం దక్కుతుందని ఊదరగొడుతున్నాయి. ఇక- ఎగ్జిట్ ఫలితాలు రాజకీయవర్గాల్లో ఉత్కంఠ చర్చకు తావిస్తున్నాయి. ఎక్కడ ఎవరు- గెలుస్తారనే దానిపైనా విశ్లేషణలు వస్తున్నాయి. వీటితో పాటు మరి కొన్ని సంస్థలూ అభ్యర్థులు కూడా ఉత్కంఠగానే వీటిని దేశం కూటమికి అనుకూలంగా ఫలితాలను వెల్లడించాయి. రాష్ట్రంలో పేరున్న ఆరా మస్తాన్ సంస్థ మాత్రం వైసిపికి అధికారం వస్తుందని ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించింది. పార్లమెంటు సీట్లలో ఒక్క సీటు మాత్రమే రెండు పార్టీలకు తేడా చూపారు. అసెంబ్లీ వీక్షించారు. మరో రెండు రోజులు ఫలితాల కోసం వేచి చూడక తప్పదు. అయితే ఎగ్జిట్ఫోల్స్ మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు తెలుగుదేశం వైపు ఉండగా.. మరికొన్ని వైసిపికి అనుకూలంగా ఉన్నందున ఇరుపార్టీలూ గెలుపు ధీమాతోనే ఉన్నాయి.
ఆ వైపు కొన్ని..ఈ వైపు కొన్ని..కూటమి గెలుస్తుందనికొన్ని సర్వే సంస్థల వెల్లడి …వైసిపి గెలుస్తుందంటున్న మరికొన్ని సంస్థలు -ఎగ్జిట్పోల్స్ సంస్థలభిన్నాభిప్రాయాలుఉత్కంఠగా …వీక్షిస్తున్న ప్రజానీకం..
02
Jun