దేశం మొత్తం ఎంతో అతృతుగా చూసిన ఎగ్జిట్ ఫలితాలు వచ్చేశాయి. ఎటువంటి తేడాలు లేకుండా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ కూడా ప్రకటించాయి. అయితే ఏపీ రాష్ట్ర పరిస్థితికి వచ్చే సరికి సర్వేలు భిన్నమై ఫలితాలను ప్రకటించాయి. నేషనల్ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధింస్తుందని ప్రకటించగా, స్థానిక సర్వేలు వైసీపీకి పట్టం కట్టాయి. అయితే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఆరా మస్తాన్ సర్వే కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు.
ఆరా మస్తాన్ తన సర్వేలో తిరిగి వైసీపీనే అధికారంలోకి వస్తుందని తేల్చేశారు. 94 నుంచి 104 సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. పలువురు మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నారని ఆయన ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఓ వార్త ఛానెల్లో మాట్లాడిన ఆరా మస్తాన్.. తన సర్వే రిపోర్టు గురించి వివరించారు. రోజా, సిదిరి అప్పలరాజు, అమర్నాథ్ వంటి మంత్రులు ఓడిపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. విడుదల రజినీ, అంబటి రాంబాబు గట్టి పోటిని ఎదుర్కొంటున్నారని ఆరా మస్తాన్ తెలిపారు.
ఏపీలో నా సర్వే తప్పని తేలితే ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఉండడు
02
Jun