సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గం లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు , ఇంచార్జ్ రఘునాథ్ యాదవ్ తనదైన శైలిలో యువకులను ముందుండి నడిపించడం
తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ సూచనలతో అభ్యర్థి శ్రీ గణేష్ విజయం లో తనదైన శైలి చూపించారు.
రాష్ట్రం లో కొద్ది నెలల క్రితం శాసన సభ కు జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయింది.
దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణానంతరం ఆయన కుమార్తె లాస్య నందిత ఎమ్మెల్యేగా విజయం సాధించారు.అనంతరం లాస్య నందిత రోడ్ ప్రమాదం లో దుర్మరణం పాలయ్యారు.
దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మరో సారి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ నీ కాంగ్రెస్ బరిలో నిలిపింది.బిఆర్ఎస్ నుండి లాస్య నందిత సోదరి నివేదిత సాయన్న, బిజెపి నుంచి వంశ తిలక్ లను అభ్యర్థులుగా ఆయా పార్టీలు ప్రకటించాయి. అభ్యర్థి శ్రీ గణేష్ కి ఎన్నికల ప్రచారం లో ముందుండి నడిపేందుకు యువనేత రఘునాథ్ యాదవ్ ను నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడిని రంగంలోకి దింపింది. ఎన్నికలకు 15 రోజుల సమయం మాత్రమే వున్న సమయం లో యువనేత రఘునాథ్ యాదవ్ కంటోన్మెంట్ లోని కిందిస్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర నాయకుల వరకు అందరిని కలుపుకుపోతూ కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచడంలో తన వంతు కృషి చేశాడు. పట్టుదలతో కష్టపడితే రాజకీయాలలో విజయం సాధించవచ్చని శ్రీ గణేష్ గెలుపు తో నిరూపించాడు రఘునాథ్ యాదవ్ .తక్కువ కాలంలో తన దైన శైలితో పార్టీ క్యాడర్ ను నడిపిన యువ నేతను అటు రాష్ట్ర నాయకులు,కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు అభినందిస్తున్నారు.


