పర్యావరణాన్ని కాపాడుకుందాం- ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహణ

పర్యావరణాన్ని కాపాడుకోవడంలో విద్యార్థులు ముందుండాలని ఎం ఈఓ జి.సుబ్బయ్య అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వి.కె. హైస్కూల్లో బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ… పర్యావర ణాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ దాని ఆవశ్యక తపై విద్యార్థులకు వివరించారు. రానున్న రోజుల్లో చెట్లను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలన్నారు. ఎం ఈ ఓ -2 సుధాకరరావు, ప్రిన్సిపాల్ కె.ఆంజనేయులు, హెచ్ఎం
ఎం శేషగిరిరావు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత- తాళ్లూరు మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బొద్దికూరపాడు రైతు భరోసా కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏవో ప్రసాదరావు మాట్లాడుతూ …ప్రతి ఒక్కరూ ఇంటికొక మొక్క నాటాలని, తద్వారా ఎండలు వేడిని తగ్గించుకొని భూగోళం వేడి కూడా తగ్గించుకునేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పెంచితే పర్యావరణాన్ని రక్షించుకున్న వారమవుతామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *